
రెక్కల కష్టం మిగలడం లేదు..
సీసీఐ కొనుగోలు లేకపోవడంతో అరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అడ్డికి పావు సేరుకు అమ్ముకున్నాం. మాకున్న 2ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాం. పెట్టుబడులకు రూ.లక్ష ఖర్చు అయ్యింది. సీసీఐ సెంటర్ అందుబాటులో ఉంటే క్వింటాల్‌కు రూ.8వేల పైన ధర వచ్చేది. ఇప్పటి వరకు సీసీఐ సెంటర్ ప్రారంభించకపోవడంతో ప్రైవేటులో క్వింటాల్‌కు రూ.7వేలు ఇచ్చారు. 15క్వింటాళ్ల దిగుబడి రాగా పెట్టుబడి ఖర్చులకే సరిపోయింది. అదే సీసీఐ సెంటర్ ఉంటే మరో రూ. 20వేలు మిగిలి ఉండేది.
– తోట రమేశ్,పత్తి రైతు, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్