
తక్కువకు అమ్ముకుంటున్నాం..
ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా.. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు చేశా..అతి, అనావృష్టితో మొదటి సేకరణలో 14 క్వింటాళ్ల దిగుబడి రాగా, సగం మేర తగ్గింది. పత్తి సేకరణ కోసం కూలీల కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించడం లేదు. కుటుంబసభ్యులమంతా కలిసి సేకరణ చేస్తున్నాం. సేకరించిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకుందామంటే సీసీఐ సెంటర్లను ఏర్పాటు చే యలేదు. డబ్బులు అత్యవసరమై ప్రైవేటులో రూ.5800లకు అమ్ముకోవడంతో తీవ్ర నష్టం వచ్చింది.
– పోతరబోయిన ఎలేందర్, పత్తి రైతు,
అంకుషాపూర్(బంజరపల్లి), తరిగొప్పుల