ప్రసవాల సంఖ్యను పెంచాలి
జఫర్‌గఢ్: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచే దిశగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి, జిల్లా ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నరేందర్‌తో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. గత నెల కేవలం రెండు ప్రసవాలే చేశారని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్, వైద్యలు ఆశోక్, కమల్‌హసన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు


