సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకోండి
లింగాలఘణపురం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేసుకొని బిల్లులు పొందాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. బుధవారం మండలంలోని బండ్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు...ఇళ్లు ఎలా నిర్మించుకుంటున్నారు..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందా? అంటూ వివరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకుంటే బిల్లులు కూడ వెంటనే వస్తాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇళ్లు నిర్మించుకుంటే లబ్ధిదారులపై ఎక్కువ భారం పడకుండా ఇల్లు పూర్తి చేసుకోవచ్చని సూచించారు. కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, కార్యదర్శి సంతోషిమాత తదితరులు ఉన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా


