పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సజావుగా జరగాలి
జనగామ రూరల్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పత్తి, ధాన్యం, మొక్కజొన్న ప్రొక్యూర్‌మెంట్ స్పెషల్ ఆఫీసర్ యాస్మిన్ బాషా అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెనన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధి కారి, సివిల్ సప్లై మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కపాస్ కిసాన్ యాప్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు రైతులకు కనబడే విధంగా ఏర్పా టు చేయాలన్నారు. అంతకుముందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన యాస్మిన్ బాషాను అదనపు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలెక్టరేట్‌లో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యాస్మిన్ బాషా


