బ్రేకర్ సమస్యకు పరిష్కారం
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని కరెంటు సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ సమస్యను పరిష్కరించినట్లు ట్రాన్స్‌కో ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. సాక్షి దినపత్రికలో బచ్చన్నపేటలో కరెంట్ గోస తప్పదా.. అని ప్రచురించిన కథనానికి స్పందించిన అధికారులు బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. బచ్చన్నపేట, ఎద్దుగూడెం 11 కేవీ ఫీడర్‌లకు సమస్య ఉండగా ప్రొటెక్షన్ వింగ్ ఏఈ జవహర్, సిబ్బందితో కలిసి బ్రేకర్‌లో లిండ్ సమస్యను పరిష్కరించామని, అలాగే రిలేను కూడా మార్చామన్నారు. దీంతో అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో లైన్‌మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.
బ్రేకర్ సమస్యకు పరిష్కారం


