పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం
● ఘనంగా నివాళులర్పించిన
డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: సమాజ శాంతిభద్రతల కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్స వం పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ జంక్షన్ అమరవీరుల స్తూపం వద్ద డీసీ పీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, రాజన్‌బాబు, చెన్నకేశవులు, రాజేశ్, పోలీసు సిబ్బంది పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. డీసీపీ మాట్లాడుతూ..అమరవీరుల స్ఫూర్తి ప్రతీ పోలీసు సిబ్బందికి మార్గదర్శకం కావాలన్నారు.


