జిల్లాప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు
జనగామ: చీకట్లను తొలగించి వెలుగును అందించే దీపావళి పండగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే పండుగ కావాలని ఆకాంక్షించారు. కుటుంబసభ్యులందరితో కలిసి జిల్లా ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి
● డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి
నర్మెట: కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు, కన్నెబోయినగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నక్కల గట్టయ్య, డైరెక్టర్లు అర్జుల సుధాకర్‌రెడ్డి, బోగ అంజయ్య, గోపగోని శోభారాణి, కూకట్ల చంద్రమౌళి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, సీఈఓ కొన్నె వెంకటయ్య, ప్రజ్ఞాపురం మల్లయ్య, ఐలేని కేశవరెడ్డి, శివ, పలుపార్టీల నాయకులు, హమాలీసంఘం, రైతులు పాల్గొన్నారు.
మోటార్ వాహనాల చట్టాన్ని రద్దుచేయాలి
జనగామ రూరల్: కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం–2020ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో బూడి ద ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన యూనియన్ రెండో మహాసభకు పుప్పాల శ్రీకాంత్ హజరై మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిన మోటార్ వెహికల్ చట్టం వల్ల ప్రభుత్వం చెప్పిన్నట్లు రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా ఇంకా పెరిగాయని ఆరోపించారు. అనంతరం 15 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భూడిద ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా సుంచు విజేందర్, కోశాధికారిగా మహేందర్, ఉపాధ్యక్షులుగా గంధమల్ల నరసింహస్వామి, షేక్ మునివర్, మొగులయ్య తదితరులను ఎన్నుకున్నారు.
జిల్లాప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు


