హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం
● టీజీఈడబ్ల్యూయూ రాష్ట్ర వర్కింగ్
ప్రెసిడెంట్ పైళ్ల గణపతిరెడ్డి
దేవరుప్పుల: కార్మికుల హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలే శరణ్యమని టీజీఈడబ్ల్యూయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సింగరాజుపల్లి తుమ్మగార్డెన్స్‌లో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జనగామ జిల్లా 3వ మహాసభ పురస్కరించుకొమని తొలుత సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్నగౌడ్ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు..గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు నిత్యం గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, వైకుంఠధామాలు, పల్లె పకృతి వనాల నిర్వహణతో పాటు పల్స్ పోలియో, ఓటరు నమోదు, ఎన్నికల నిర్వహణలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో కీలక భాగస్వామ్యులు పనిచేస్తున్నారన్నారు. .
నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవం..
గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాపర్తి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బస్వ రామచంద్రంగౌడ్, కోశాధికారిగా బత్తిని వెంకన్న, ఉపాధ్యక్షులు నారోజు రామచంద్రం, పరంజ్యోతి, సహాయ కార్యదర్శిగా నూనెముంతల యాకన్న తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి. యాదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగారపు రమేశ్, ప్రజానాట్యమండలి నాయకులు వెంకటరెడ్డి, ఆయా మండలాల బాధ్యులు పాల్గొన్నారు.


