
వెళ్లిరావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ వీడ్కోలు
● ఘనంగా గణేశ్ నిమజ్జనం
● శోభాయాత్రలో కోలాటాలు, నృత్యాల సందడి
● అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు
● నెల్లుట్ల చెరువు వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లు
ట్రాఫిక్‌పై నజర్..
పట్టణంలో భారీ గణపతుల ఊరేగింపు నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నెహ్రూ పార్కు నుంచి సూర్యాపేట రోడ్డు మీదుగా నెల్లుట్ల చెరువు వరకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మండపాల నుంచి గణపతులు శోభాయాత్రకు బయలుదేరాయి. అర్ధరాత్రి 1.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.
పట్టణంలోని బాలాజీనగర్, కుర్మవాడ, అంబేడ్కర్‌నగర్, జ్యోతినగర్, శ్రీనగర్ కాలనీ, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, శ్రీవిల్లాస్ కాలనీ, జీఎంఆర్ కాలనీ, నెహ్రూపార్కు, వీవర్స్‌కాలనీ, పాత బీట్‌బజార్, సూర్యాపేట రోడ్డుతో పాటు ఆయా కాలనీల్లో కొలువు దీరిన గణపతులను ఊరేగింపుగా చెరువుల వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆధ్వర్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, డీపీవో స్వరూప, డీఆర్‌డీఓ పీడీ వసంత, తహసీల్దార్ హుస్సేన్, జిల్లా ఫైర్ ఆఫీసర్ రేమండ్ పీటర్ తదితర శాఖల ఉన్నతాధికారులు నిరంతరం శ్రమించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం జరుగగా, కంటిన్యూగా నేడు కూడా జరగనుంది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ఏసీపీ భీమ్‌శర్మ, తహసీల్దార్ రవీందర్, ఎన్‌పీడీసీఎల్ డీఈ లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్ గణనాథుడు
కాలనీల నుంచి ఊరేగింపులు

వెళ్లిరావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ వీడ్కోలు

వెళ్లిరావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ వీడ్కోలు

వెళ్లిరావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ వీడ్కోలు

వెళ్లిరావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ వీడ్కోలు