
న్యాస్‌లో కలెక్టర్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు
జనగామ: న్యాస్(నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వే)లో జనగామ జిల్లా జాతీయస్థాయిలో 50వ స్థానం, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచి ప్రతిభను కనబరిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఉత్తమ అవార్డు అందుకున్నారు. జిల్లాలో పాఠశాల విద్యను అభివృద్ధి చేయడంలో కలెక్టర్ పాత్రను గుర్తిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడంతో తనపై బాధ్యత రెట్టింపు అయ్యిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు.
సీఎం చేతులమీదుగా ఏసీతో కలిసి స్వీకరణ