
మహా రక్తదాన శిబిరం
జనగామ రూరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం టీఎస్ మేసా, హమ్ సాత్ ఫౌండేషన్, మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణలోని ఏరియా హాస్పిటల్‌లో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథి డీసీపీ రాజా మహేంద్రనాయక్ శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 75 మంది రక్తదానం చేయగా వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే మహ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో డీసీపీ అసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో మాజీ కౌన్సిలర్ మల్లిగారి రాజు 96వ సారి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రాజేశ్, రాజన్‌బాబు, హమ్ సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా, టీఎస్ మేసా జిల్లా అధ్యక్షుడు అంకుషావలి, తహసీన్ ఇస్మాయిల్, అజారుద్దీన్, మచ్చ కుమార్, యాకూబ్ పాషా, అజర్ గౌస్‌భాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు: ఈనెల 7న (ఆదివారం) రాత్రి చంద్ర గ్రహణం కారణంగా అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాల యం మూసివేయనున్నట్లు ఈఓ కందుల సుధాకర్, చైర్మన్ కొమ్మగోని ప్రభాకర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందన్నారు.