
హైదరాబాద్‌కు తరలిన జీపీఓలు
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓ) పాలన తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి 129 మంది జీపీఓలు అర్హత సాధించగా, శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పర్యవేక్షణలో ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి రెండు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. హైటెక్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జీపీఓలకు ఆర్డర్ కాపీలను అందించారు. నేటి(శనివారం) నుంచి జీపీఓల సేవలు కొనసాగనుండగా, వారికి మండలాలు కేటాయించాల్సి ఉంటుంది. జీపీఓలు సొంత నియోజకవర్గం, మండలంలో పనిచేయకుండా నిబంధనలు విధించారు.