
జాతీయ లోక్ అదాలత్‌ను
సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
జనగామ రూరల్: జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌పై కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. డీసీపీ బి.రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పెండింగ్‌లో ఉన్న రాజీపడ తగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకునేలా కక్షిదారులకు సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, ఇ.సుచరిత, జూనియర్ సివిల్ జడ్జి శశి, ఆర్డీఓ కె.గోపిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.సుహాసిని, ఏసీపీలు ఎ.నర్సయ్య, ఆర్. భీమాశర్మ, ప్లీడర్ రామ్మోహన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిచంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.