
ఎన్‌సీడీ నుంచి మినహాయించండి
జనగామ: ప్రభుత్వం ఎన్‌సీడీ ఆన్‌లైన్ ప్రోగ్రాం నుంచి ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏలను మినహాయించాలని కోరుతూ శనివారం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావుకు వినతిపత్రం అందించారు. అనంతరం దేవేంద్ర, ఎ.శారద, ఎన్.పద్మావతి, అమృత, వసంత, సవిత, జ్యోతి, కుల్సూమ్ సుల్తాన్ మాట్లాడుతూ.. ఎన్‌సీడీకి సంబంధించి 2014లో స్టేట్ లెవల్ అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్(ఎన్‌సీడీ) చేసిన తర్వాత 2017, 2022 రీ స్క్రీనింగ్ సైతం చేశామన్నారు. 2022 సంవత్సరంలో సైతం చేసినట్లు స్పష్టం చేశారు. 2025లో మరో యాప్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చి గత వివరాలను నమోదు చేయాలనడం భావ్యం కాదన్నారు. ఒకే పనిని రెండు, మూడుసార్లు చేయిస్తుండడంతో తమకు అప్పగించిన వైద్యసేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి విముక్తి కలిగించాలన్నారు.
డీఎంహెచ్‌ఓకు ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏల వినతి