
పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకం
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ: పట్టణ స్వచ్ఛతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలమకని, పారుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉండొద్దని, సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. పట్టణ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ వివరాలను త్వరగా ఆన్‌లైన్ చేయాలన్నారు. పట్టణంలో ట్రేడ్ లైసెన్సులు కలిగిన వారే వ్యాపారా లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులకు ప్రొసీడింగ్ కాపీలను అందించాలని ఆదేశించారు. సమీక్ష అనంత రం 154 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెండు జతల దుస్తులు, టవల్స్ అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.