
కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: నాణ్యమైన విత్తనాలు మాత్ర మే విక్రయించాలి.. రైతులకు నకిలీ, కల్తీ విత్తనా లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ చేతన్‌నితిన్‌తో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, సమన్వయం చేసుకుని నకి లీ, కల్తీ విత్తనాల సరఫరా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీలర్లందరూ విత్తన చట్టానికి లోబడి వ్యాపారం చేసుకోవాలని చెప్పారు. స్టాక్ బోర్డు తప్పనిసరిగా ప్రదర్శించాలని, స్టాక్ రిజిస్టర్‌లో రైతుల కొనుగోళ్ల వివరాలు నమోదు చేయాలన్నారు. సీడ్ సర్టిఫికేషన్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనాలని చెప్పారు. కాల పరిమితి ముగిసిన పురుగు మందులు విక్రయించినా, పీసీలు లైసెన్స్‌లో పొందుపరచకుండా స్టాక్ అమ్మినా, రైతులకు రశీదులు ఇవ్వకున్నా చర్యలు తప్పవన్నారు. అంతకుముందు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాల పై డీలర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. డీఏఓ రామారావు నాయక్, ఘనపూర్(స్టేషన్), వర్ధన్నపేట ఏసీపీలు భీంశర్మ, నర్స య్య, డీపీడీ విజయశ్రీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ పజ్జూరి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
రాత పరీక్షకు పక్కా ఏర్పాట్లు
● అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్
జనగామ రూరల్: జిల్లాలో ఈనెల 25న గ్రామ పాలనా అధికారుల రాత పరీక్ష పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నా రు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికా రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఏబీ వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట ల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జీపీఓల నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించగా జిల్లా నుంచి 110 దరఖాస్తులు వచ్చాయని, అందులో 97 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. స్పెషల్ డిపూటీ కలెక్టర్ సుహాసిని, చీఫ్ సూపరింటెండెంట్ నర్సయ్య, అబ్జర్వర్, సిట్టింగ్ స్క్వాడ్ విక్రమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు