
నాలుగు కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్‌లు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: కొడకండ్ల, దేవరుప్పుల, జనగామ, లింగాలగణపురం కేజీబీవీల్లో ‘నిర్మాణ్’ సంస్థ కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ ను వారి చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పండించిన పంటను ఆహారంగా విద్యార్థులకు అందించి రాబోయే తరాన్ని ఆరోగ్యకరంగా అభివృద్ధి చేసేందుకు ‘నిర్మాణ్ సంస్థ ముందుకు వచ్చిందని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి పూర్తి సహకారం లభిస్తుందని, మరిన్ని కిచెన్ గార్డెన్‌లతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులతో ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు అరుణ్‌కుమార్, నిఖిల్ పటేల్‌కు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో ఏఓ మన్సూరీ, గౌసియాబేగం పాల్గొన్నారు.
‘హనుమంతుడికి
మొదటి ప్రసాదం’
చిల్పూరు: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ సమీప హనుమాన్ ఆలయంలో హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా వానరాలు అక్కడికి చేరాయి. భక్తులు కోతులను వెళ్ల గొట్టగా ఒక కోతి ఎవరినీ ఏమి అనకుండా అక్కడే ఉండిపోయింది. పూజ పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పెట్టేందుకు అర్చకుడు రవీందర్‌శర్మ పులిహోరను చేతిలోకి తీసుకుని కుర్చీలో కూర్చున్నాడు. అక్కడే ఉన్న కోతి నెమ్మదిగా వచ్చి ఆయన పైకి చేరి చెతిలోని పులిహోరను తిని వెళ్లి పోయింది. దీంతో భక్తులు హనుమంతుడే మొదటి ప్రసాదం స్వీకరించాడంటూ సంతోషపడ్డారు.
తెలుగు సాహిత్యానికి పద్యం తలమానికం
జనగామ రూరల్: తెలుగు సాహిత్యానికి పద్యం తలమానికమని ప్రముఖ కవి, పరిశోధకుడు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ అన్నా రు. విద్యాశాఖ ఆధ్వర్యాన తెలుగు భాష ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా గురువారం ‘తెలుగు పద్య వైభవం’ అనే అంశంపై శ్యాంప్రసా ద్ మాట్లాడుతూ.. పద్యం తెలుగు సాహిత్య గౌరవాన్ని నిలబెడుతూ వందల ఏళ్లుగా వివిధ భూమికలను నిర్వహిస్తూ వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, తెలుగు సాహిత్యపీఠం అధ్యక్షుడు పానుగంటి రామమూర్తి, ఏఎంఓ శ్రీనివాస్, ఎస్‌ఓ రమేశ్, ఆర్‌పీలు శేషుకుమార్, రజితకుమారి, బలరాం, శ్రీనివాసాచారి, కుమారస్వామి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు
79 మంది గైర్హాజరు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు గురువారం 79 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కలిపి 809 విద్యార్థులకు 752 మంది, మధ్యాహ్నం సెకండియర్ 308 విద్యార్థులకు 286 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. డీఐఈఓ జితేందర్ రెడ్డి పాలకుర్తి, జనగామ సెంటర్లను సందర్శించారు.

నాలుగు కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్‌లు

నాలుగు కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్‌లు