
రైతు భరోసాకు వేళాయె..
జనగామ: యాసంగి సీజన్ మధ్యలోనే నిలిచిన రైతు భరోసా పెట్టుబడి సాయం నేటి(శుక్రవారం) నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీజన్‌కు ముందు నాలుగు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. మిగతా రైతులను హోల్డింగ్‌లో ఉంచింది. దీంతో నాలుగు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. పంట కోతలు దగ్గర పడి ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరుకునే సమయంలో రైతు భరోసాకు మోక్షం లభించింది. వానాకాలం సీజన్‌కు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో రెండు కలిపి పెట్టుబడి సాయం అందిస్తే అప్పులు చేసే అవసరం ఉండదనే అభిప్రాయం అన్నదాతల నుంచి వ్యక్తం అవుతున్నది. జిల్లాలో 3.50 లక్షల ఎకరా ల సాగు భూమి ఉంది. ఇందులో ఏటా యాసంగి సీజన్‌లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు కలుపుకుని 2లక్షల ఎకరాల వరకు సాగవుతున్న ది. కాగా యాసంగి సీజన్‌లో 1,79,498 మంది రైతులు పెట్టుబడి సాయానికి అర్హత సాధించారు. ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.217.16 కోట్ల మేర బడ్జెట్‌ను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ఇందులో నాలుగు ఎకరాల వరకు 1,53,185 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.143.68 కోట్ల మేర ఫిబ్రవరిలో జమయ్యాయి. ఆ తర్వాత కాలయాపన కావడంతో రైతులు వ్యవసాయ అధికారులను అడిగినా ప్రయోజనం లేక పోయింది. యాసంగిలో అతివృష్టి, అనావృష్టితో దిగుబడులు కోల్పోయిన రైతులు మిగిలిన కొద్దిపాటి ధాన్యం అమ్ముకున్నారు. చాలా మందికి పెట్టుబడి కూడా రాలేదు. ఈ క్రమంలో కనీసం ఐదెకరాలు ఉన్న అన్నదాతలకు రైతు భరోసా రూ.6వేల చొప్పున రూ. 30వేల పెట్టుబడి సాయం వస్తే కొంత వెసులు బాటుగా ఉంటుందని ఆశించినా నిరాశే ఎదురైయింది. ఎట్టకేలకు శుక్రవారం(నేడు) నుంచి మిగిలి న యాసంగి రైతులకు రూ.6వేల చొప్పున పెట్టుబ డి సాయం జమ చేయనుండడంతో రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
యాసంగి పెట్టుబడి సాయం వివరాలు
నేటి నుంచి యాసంగి పెట్టుబడి సాయం
మధ్యలో నిలిచిపోయిన వారికి చెల్లింపు
జిల్లాలో రైతులు 26,313 మంది
చెల్లించే మొత్తం రూ.73.48 కోట్లు
నాలుగు నుంచి ఐదెకరాలపైన వారికి..
వానాకాలం సీజన్‌కు అన్నదాత సన్నద్ధం
మొత్తం రైతులు : 1,79,498
పెట్టుబడి సాయం : 217.16కోట్లు
నాలుగెకరాల వరకు చెల్లింపు : రూ.143.68కోట్లు
చెల్లించాల్సిన పెట్టుబడి సాయం : రూ.73.48కోట్లు
సాయం అందుకున్న రైతులు : 1,53,185
మిగిలి ఉన్న రైతులు : 26,313

రైతు భరోసాకు వేళాయె..