లక్ష్య సాధనలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనలో ముందుండాలి

May 9 2025 1:04 AM | Updated on May 9 2025 1:04 AM

లక్ష్య సాధనలో ముందుండాలి

లక్ష్య సాధనలో ముందుండాలి

జనగామ: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్య సాధనలో ముందుండాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నా రు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పని తీరుపై గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా ప్రసూతి సేవలతో పాటు డెలివరీలు 50, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 15కు తగ్గకుండా చేయాలన్నారు. మొదటి నెల చెకప్‌ నుంచి గర్భిణి రిజిస్ట్రేషన్‌ మొదలు డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, జీరో మాతృమరణాల కోసం అంకితభావంతో పని చేయాలని చెప్పారు. ఎన్‌సీడీ ప్రోగ్రాంలో తప్పులు లేకుండా వివరాలను రికార్డు చేయాలని, టీబీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సబ్‌ సెంటర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న కంటిపరీక్షల వైద్య శిబిరాలు జూన్‌ 15లోగా పూర్తి చేయాలని అన్నారు. ఎండా కాలంలో వడ దెబ్బ నివా రణపై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సలహా లు ఇవ్వడంతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూ చించారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, వైద్య విధాన పరిషత్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వీరాంజనేయులు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ డి.రవీందర్‌గౌడ్‌, డాక్టర్‌ స్వర్ణకుమారి, డాక్టర్‌ సుధీర్‌, డాక్టర్‌ అశోక్‌కుమార్‌, డాక్టర్‌ కమల్‌హసన్‌ పాల్గొన్నారు.

తాగునీటి ఇబ్బందులు రావొద్దు

వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. గురువారం మండలాల వారీగా వివిధ శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు సంబంధించి మోటా ర్లు, పైపులు రిపేరుకు వస్తే తమ దృష్టికి తీసుకొచ్చి మరమ్మతు చేయించాలని చెప్పారు. అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

జనగామ రూరల్‌: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. గురువారం కలెక్టరెట్‌లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ‘నషా ముక్తి అభియాన్‌’ కింద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం.. కంచి వెల్ఫేర్‌ సొసైటీ హైదరాబాద్‌ ఎన్జీఓ ఆధ్వర్యాన అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అటెండర్లు, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్‌, డీఆర్‌డీఓ వసంత, డీపీఓ స్వరూప, తిరుమల బ్యాంకు మేనే జర్‌ నంగునూరు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement