జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

న్యూస్‌రీల్‌

తెలంగాణ రైజింగ్‌– 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు మహిళ ఆర్థిక సాధికారతకు కృషి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

7

బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ ఏడాది మార్చి 6న ప్రారంభించిన 99రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా సాగుతోందని మంత్రి న్నారు. పరిశుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, రోడ్డుసేఫ్టీ,సంక్షేమం, పిల్లల భద్ర త, రైతు సంక్షేమం, విద్య వంటి అంశాలు చేపడుతున్నామని వివరించారు.

మహిళా ఆర్థిక సాధికారతకు కృషి

ఇందిరా మహిళాశక్తి కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.783.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, రూ.793.74 కోట్లు మాఫీ చేశామన్నారు. సీ్త్రనిధి ద్వారా మహిళాసంఘాలకు రూ.80 కోట్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది ధాన్యం ఎక్కువగా పండిందని, అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నామని, రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు.

సమైక్య భవనాల ఏర్పాటు

మహిళా సంఘాల అభివృద్ధికి రూ.5 కోట్లతో సమైక్య భవనా లు ఏర్పాటు చేసి, 1,18,448 యూనిఫాం కుట్టించే బాధ్యత ఇచ్చామని తెలిపారు. మహాలక్ష్మీ పథకాన్ని 7.69 లక్షల మంది సద్వినియోగం చేసుకున్నారని, వారికి రూ.318.99 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500 సబ్సిడీతో 1,98,417 గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 2,10,376 విద్యుత్‌ కనెక్షన్లకు రూ.167.11కోట్లు చెల్లించామని వివరించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని 13 వేల మందికి రూ.36.23 కోట్లు అందించామన్నారు.

గర్భిణులకు పౌష్టికాహారం

గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో 1065 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 11,758 మంది గర్భిణులు, బాలింతలు 30,282తోపాటు 14,102 మంది పిల్లలకు నాణ్యతా ప్రమాణాలతో పోషకాహారం అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు రిట్రో మోటా ర్‌ వాహనాలు, ల్యాప్‌ టాప్‌లు, బ్యాటరీ ఆపరేటెడ్‌ వీల్‌చైర్లు, స్మార్ట్‌ ఫోన్లు, హైబ్రిడ్‌ వీల్‌చైర్లు వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. వృద్ధుల సంక్షేమానికి 50 పడకల సదనాన్ని రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు.

అర్హులందరికీ ఇళ్లు

జిల్లాలో 10,860 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 7,745 మంది నిర్మాణానికి ముందుకొచ్చారని, ఇందులో 1274 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 45,617 కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా 3,52,072 కుటుంబాలకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేశామన్నారు.

మైనార్టీల సంక్షేమానికి..

మైనార్టీల సంక్షేమంలో భాగంగా మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మందికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన కింద 76 మందికి రూ.38 లక్షలు మంజూరు చేశామన్నారు. షాదీముబారక్‌ కింద రూ.5.56 కోట్లు ఇచ్చామన్నారు.

పకడ్బందీగా భూభారతి

భూభారతి చట్టాన్ని పకడ్బందీగా చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే నక్ష లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టామన్నారు. అనంతరం 735 స్వయం సహాయక సంఘాలకు రూ.73.50 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 46 స్వయం సహాయక సంఘాలకు రూ.6.09కోట్ల చెక్‌ అందించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, గ్రంథాలయ సంస్థచైర్మన్‌ సంగనభట్ల దినేశ్‌, ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అర్హులందరికీ

పథకాలు

జగిత్యాల: రాష్ట్రాన్ని అగ్రగామిగా

నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో ముందుకెళ్తున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్‌ ఎంటర్‌పైజెస్‌ మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే

లక్ష్యమని తెలిపారు.

విద్యారంగానికి పెద్దపీట

విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రీప్రైమరి నుంచి ఇంటర్‌ వరకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూరు చేశామన్నారు. షెడ్యూల్‌ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో వసతిగృహాలను నిర్వహించడంతోపాటు.. వారికి కాస్మోటిక్‌ చార్జీలు పెంచామన్నారు.

రైతును రాజు చేస్తాం..

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకం కింద 2.30లక్షల మందికి 166.16 కోట్లు వారివారి ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు సలహాలు అందించేందుకు శాస్త్రవేత్తలచే అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు.

ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని, జిల్లాకేంద్ర ఆస్పత్రిలో 5,056 ప్రసవాలు కాగా.. అందులో 1384 సాధారణ, 3,672 సిజేరియన్‌ ఉన్నట్లు తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద 1,07,065 మందికి రూ.49.21కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement