మంత్రిని కలిసిన పలువురు | - | Sakshi
Sakshi News home page

మంత్రిని కలిసిన పలువురు

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

జగిత్యాల/జగిత్యాలక్రైం: రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరైన మంత్రి అజారోద్దీన్‌ను మంగళవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. అనంతరం మంత్రి డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి కుమారుడు ముస్కు సిద్దార్థ్‌ రెడ్డిని అభినందించారు. సిద్దార్థ్‌ రెడ్డి ఇటీవల జరిగిన అండర్‌–11 క్రికెట్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చాడు. క్రీడలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే అద్భుతమైన ఆట తీరు కనబర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంత్రిని పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

మల్లాపూర్‌ ఏడీఈకి ఉత్తమ ప్రశంసపత్రం

మల్లాపూర్‌: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వరంగర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో మల్లాపూర్‌ ఏడీఈ అమరేందర్‌కు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందించారు. ఇదే స్ఫూర్తితో సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement