పొడుపు కథలు | - | Sakshi
Sakshi News home page

పొడుపు కథలు

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

పొడుపు కథలు

01. గోధుమ వన్నె దేహం

సోగ కన్నుల విత్తనం

తింటే నోటికి జిగట

02.అమ్మాయి పేరున్న పండు

సింధూరంలా మెరిసే పండు

సిట్రన్‌ జాతి తినే పండు

03. పండ్లన్నింటికీ రారాజు

రుచిని తూచలేదు తరాజు

04. ఒళ్లంతా ముళ్లుంటాయి

నెత్తి మీద ఆకులుంటాయి

పులుపు తీపి రుచులుంటాయి

05. కాటుక రంగు పిల్లల్ని

కడుపుపున దాచుకున్న (మోస్తున్న)

మిసిమి దేహపు అమ్మ

06. బాలిక నామం పెట్టుకున్నది

దేహమంతా కన్నులు కలది

విత్తుల చుట్టూ కండ కలిగినది !

07. ఎండాకాలంలో ఎర్రని రసాలు

నేలన పాకే తీగాలకే కాయలు

దీని పొట్ట నిండా నీటి నిల్వలు

08. రంగేమో మేలిమి బంగారం

రుచేమో మధురాతి మధురం

పిల్లేమో ముదురు నీటి టెంక ఫలం

09. ఒళ్లంతా పసుపు పూసుకున్న ముత్తైదువ

పూజలకూ వ్రతాలకూ ముందుండే ముత్తైదువ

10. ఈ పండును రోజూ తింటే

డాక్టరు వద్దకు వెళ్ళే పని లేదు

ఈ చెట్టు కింద కూర్చుంటేనే

భూమ్యాకర్షణ తెలిసింది !

11. సపోటా వుర్ల గడ్డలతో పోలికలు

అడ్డుకోతలో సూర్యకిరణాల చిత్రాలు

తింటే బీపీ, ఎల్‌ డీఎల్‌ ల తగ్గుదల

12. గుత్తులు గుత్తులుగా పండ్లు

కానీ ద్రాక్ష గుత్తులు కాదు

మెత్తని జెల్లీ లాంటి కండలు

కానీ తాటి ముంజలు కాదు

13. ఉసిరిలా కాండానికి కాస్తాయి

ద్రాక్షలా గుత్తులుగా కాస్తాయి

చైనా దేశంలో అధికంగా కాస్తాయి

14. ఎరుపు తెలుపులలో ఉంటుంది

చలి కాలంలో ఎక్కువ కాస్తుంది

దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది

15. పైన సన్నగా కింద లావుగా

నీటి చుక్క వలే బుడగగా

వగరు తీపి పులుపు కలగలుపుగా

16. ఆకుపచ్చని గుండ్రని బంతులు

గర్భాన దాచి పెట్టుకున్న ముత్యాలు

రసం పిండామంటే గ్లాసులు

17. పొట్ట నిండా రత్నాల రాసులు పెట్టి

కనపడకుండా ఎర్రని తోలు కప్పారు

18. కాయలన్నింటిలో చాలా పెద్దది

పసిమి ఛాయ పిల్లలు కలది

ఘాటైన సువాసన కలది

చిటారు కొమ్మన కాస్తుంది

19. ఇల్లేమో ముళ్లకంప

పళ్ళేమో డ్రూప్‌ జాతి

రుచేమో తీపి పులుపు

రంగేమో ముదురు ఎరుపు

20. చూపుకు మేలిమి దేహాలు

పొట్ట విప్పితే పురుగులు

చెట్టు కాండానికి గుత్తులు

జావాబు:

01.సపోటా, 02.కమలా కాయ, 03.మామిడి, 04.అనాసకాయ, 05.బొప్పాయి, 06. సీతాఫలం, 07.పుచ్చ కాయ, 08.మామిడి, 09.అరటి కాయ, 10.యాపిల్‌, 11.కివి, 12. లిచి, 13.మల్బరీ,

14. జామ, 15.పియర్‌,

16. బత్తాయి, 17.దానిమ్మ,

18. పనస కాయ,

19. రేగి పండు, 20. మేడి పండు

డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన్‌

చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, సిరిసిల్ల

Advertisement
 
Advertisement
Advertisement