కరీంనగర్: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల అంచనాలు యుద్ధప్రాతిపదికన తయారుచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమ్‌రాజ్‌పల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటలను బుధవారం వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 6,160 ఎకరాల్లో మామిడి, 1,029 ఎకరాల్లో వరి, 1,520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వుపంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని తెలిపారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయన వెంట సర్పంచ్, కొలగాని శ్రీలత, డీఏవో భాస్కర్, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో రవీందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్, ఏవో కరుణ, భీమ్‌రాజ్‌పల్లి ఉప సర్పంచ్ బొమ్మన రాజమ్మ, గొల్లపల్లి సర్పంచ్ నేరెల్ల నీరజ, లక్ష్మీపూర్ సర్పంచ్ రాజశేఖర్, నేరెళ్ల ఉపసర్పంచ్ గురుజాల బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


