మేడిపల్లి: మండలంలోని కట్లకుంట, మన్నెగూడెం గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. కట్లకుంటలో 28 మంది, మన్నెగూడెంలో 49 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మండలకేంద్రంలోని పెద్ద చెరువు నుంచి ఊర చెరువుకు లిఫ్ట్ ద్వారా నీరు పంపింగ్ చేసే విషయమై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. సూరంపేట నుంచి తాండ్య్రాల వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. మన్నెగూడెం నుంచి తక్కళ్లపల్లికి రోడ్డు వేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, ఏనుగు రమేశ్‌రెడ్డి, చేపూరి నాగరాజు, మాదం వినోద్, బొంగోని రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


