ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో బుధవా రం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ నుంచి అక్బల్, ఆనఫ్ వ్యక్తులు ఎద్దు మాంసం విక్రయించడానికి రావడంతో హనుమాన్ భక్తులు అడ్డుకున్నారు. వారితో విక్రేతలు వా గ్వివాదానికి దిగారు. పైగా హనుమాన్ భక్తుల కాలర్ ప ట్టుకోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంట నే ఎస్సై నవీన్‌కుమార్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన అక్బల్, ఆనఫ్‌ను మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించా రు. గ్రామంలో గొడవలు జరగకుండా డిచ్‌పల్లి నుంచి 35 మంది పోలీసులు, మల్లాపూర్ ఎస్సై అనిల్, ఏఆర్ ఎ స్సై వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం హనుమాన్ భక్తులను విచారణ పే రిట పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో విషయం తెలు సుకున్న హనుమాన్ భక్తులు, గ్రామస్తులు స్టేషన్ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చారు. వారిపై ఎలాంటి కేసులు న మోదు చేయవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూప్‌రావు, న్యాయవాది నరేందర్‌రెడ్డి పోలీసులకు సూచించారు. మీడియా ను మాత్రం స్టేషన్‌లోకి అనుమతించలేదు. అక్బల్, అనఫ్‌పై దాడి చేసిన కొంతమంది హనుమాన్ భక్తులను గు ర్తించి కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
వర్షకొండలో ఉద్రిక్తత


