కోరుట్ల: పట్టణంలోని చారిత్రకస్థలంగా గుర్తింపు పొందిన గడిబురుజులను పరిరక్షించాలని కోరుట్ల ప్రజాసంఘాల నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించా రు. కొందరు రియల్టర్లు చారిత్రక స్థలాలను అమ్ముకోవాలని చూస్తున్నారని, వారికి రాజకీయ నాయకులు, అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. చాళుక్యుల కాలం నాటి చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లంచాలు తీసుకుని వేసిన వీఎల్‌టీలను రద్దు చేసి అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. అధికారులు, నాయకులు కళ్లు తెరిచి గడి బురుజులను రక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తప్పవన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్, ముజాహిద్, శ్రీనివాస్, చింత భూమేశ్వర్, న్యాయవాది బోయిని సత్యం, కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు సుతారి రాములు, సీపీఎం పట్టణ అధ్యక్షులు శంకర్, బీఆర్‌ఎస్ నాయకులు నగేశ్, హాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి షాహిద్, పోతని సత్యం, ముజబుర్‌రహ్మాన్, ఉప్పుగండ్ల అశోక్, బెక్కం అశోక్, మ్యాకల గణేశ్ పాల్గొన్నారు.


