జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను చిన్నచూపు చూస్తోందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో విద్యార్థులను కొడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలా సోషల్ గురుకులాల్లో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. దళిత ఆదివాసులకు పదవులు ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులపై ఎందుకు చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.


