మెట్‌పల్లి: నిందితులను గు ర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకురావాలని డీఎస్పీ రాములు అన్నారు. పట్ట ణంలోని 26వార్డులో కౌన్సిలర్ బొడ్ల రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రితో కలిసి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పోలీసులకు ఆయుధంగా మారాయన్నా రు. కెమెరాలు నిరంతరం పని చేస్తూ ఎంతో భద్రతను ఇస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వీధిలో ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని, ఇందుకు తమవంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. బల్దియా వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్ తదితరులున్నారు.


