వెల్గటూర్: మండలంలోని రాజారాంపల్లి పశువులు, కూరగాయల వారసంత వేలానికి భారీ స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన వేలంలో 37 మంది పాల్గొన్నారు. రూ.60.75లక్షలకు సంగ రాములు దక్కించుకున్నారు. గతేడాది రూ.35.11 లక్షలు పలికిన వేలం.. ఈ ఏడాది రూ.60 లక్షలు దాటడంతో గ్రామ పంచాయతీకి రూ.25లక్షలకు పైగా అదనపు ఆదాయం సమకూరిందని సర్పంచ్ సంగ రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీవో విమల, ఎంపీడీవో కృపాకర్, కార్యదర్శి మల్లేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అన్నారు. సోమవారం కళాశాలలో ఎన్జీవోలు అభివృద్ధి రంగంపై ఒరింటేషన్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఎప్పుడూ పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజసేవలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


