ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్‌గేట్ వద్ద ఆదివారం రాత్రి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలునుంచి పండి బిహర్ రాష్ట్రం ఖైమూరు బాబువ జిల్లా ఆసన్ గ్రామానికి చెందిన అఫరోజ్ అన్సారీ(21) మృతిచెందాడు. రామగుండం జీఆర్ఫీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. సూర్యాపేటలో కూలీ పనులు చేసేందుకు దీల్‌దయాల్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్ నుంచి తన సోదరులతో కలిసి సంఘమిత్ర రైలులో ఖమ్మం ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలోని పొత్కపల్లిలో అఫరోజ్ అన్సారీ ప్రమాదవశాత్తు కిందపడి తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. శవపరీక్ష చేయించి మృతుడి తమ్ముడికి అప్పగించారు.


