మాది మల్యాల మండలం రామన్నపేట. సొంత ఇంటి ప్రహరీని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో కూల్చివేశారు. మల్యాల క్రాస్ రోడ్డు నుంచి రాంపూర్ వెళ్లే ఆర్‌అండ్‌బీ మెయిన్ రోడ్డు వెడల్పు పేరుతో సుమారు రూ.3లక్షల విలువైన 27గజాల ప్రహరీని కూల్చివేసిన గ్రామ అభివృద్ధి కమిటీ, సర్పంచ్, సిబ్బందిపై చర్యలు తీసుకుని మాకు పరిహారం ఇప్పించండి.
– బండారి శంకర్‌రావు సోదరులు, రామన్నపేట
నూకపెల్లి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీలో డ్రైనేజీ నిర్మించిన అధికారులు మురుగునీరు నిలిచేలా సంప్, మోటార్ల ద్వారా పంపింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. సంపు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ప్రారంభించలేదు. సంప్ నిండి దుర్గంధం వ్యాపిస్తోంది. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. కాలనీలో పారిశుధ్య పనులు నిర్వహించడం లేదు.
– నూకపల్లి డబుల్ ఇళ్లవాసులు
మాది రాయికల్ మండలం మైతాపూర్ గ్రామం. గిరిగుట్టపైన ఉన్న కనకదుర్గదేవి అమ్మవారి ఆలయానికి నక్షా ప్రకారం దారి ఉంది. సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఎంపీ దీవకొండ దామోదర్‌రావు నిధులు సమకూర్చారు. పనులు కొనసాగుతుండగా పక్కనే ఉన్న భూమి యజమాని అడ్డుకోవడంతో నిలిచిపోయాయి. ఆలయ రోడ్డుకు హద్దులు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించండి.
– మైతాపూర్ గ్రామస్తులు


