మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. ఈవో అంజనా రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో 13 హుండీలకు 38 రోజుల్లో భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని శ్రీలలిత ట్రస్టు సభ్యులు లెక్కించారు. ఇందులో రూ.74,74,174 సమకూరింది. మిశ్రమ వెండి, బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో వేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అంజనారెడ్డి, ఏఈవో హరిహరనాథ్, ప్రధాన అర్చకులు రఘు, స్థానాచార్యులు కపీందర్, ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, అశోక్, ఏఎస్సై శ్రీనివాస్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.


