● రుణాల చెల్లింపులో రాష్ట్రంలోనే మొదటి స్థానం
మెట్‌పల్లి: వ్యాపారం, రుణాల చెల్లింపుల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను మెట్‌పల్లి పట్టణ మహిళా సమాఖ్య రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో జరిగిన సీ్త్రనిధి 13వ సర్వసభ్య సమావేశంలో సమాఖ్య అధ్యక్షురాలు బబ్బూరి లక్ష్మీ, మెప్మా టీఎంసీ సోమిడి శివకు మంత్రి సీతక్క చేతులమీదుగా అవార్డు అందించి అభినందించారు. గతంలో కూడా మెట్‌పల్లి సమాఖ్య మొదటి స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో మెప్మా ఏఓ శ్రీనివాస్, సీ్త్ర నిధి మేనేజర్ గంగాజలలు ఉన్నారు.


