జగిత్యాల: హజ్ యాత్రకు వెళ్లేవారికి జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగిత్యాల విద్య, వైద్యానికి హబ్‌గా మారిందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుజాత, శ్రీనివాస్, ఆనంద్ పాల్గొన్నారు.
దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్‌రోడ్ టీపాయింట్ వద్ద లాక్కాకుల మనోజ్‌పై దాడిచేసిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన మనోజ్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్ దీక్షిత్‌కు రూ.80 వేలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల అడగగా.. ఈనెల 17న సాయంత్రం ఇస్తానని, టీ పాయింట్ వద్దకు రమ్మని తెలిపాడు. మనోజ్ అక్కడికి చేరుకోగానే దీక్షిత్‌తోపాటు, కుసుంబ నిఖిల్, రాయికల్ నరేశ్ కూల్‌డ్రింక్ సీసాతో తలపై కొట్టారు. అతడి వద్ద ఉన్న రూ.2 వేలు లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుప్రియ కేసు నమోదు చేశారు. రౌడీషీటర్ దీక్షిత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


