జగిత్యాల/ధర్మపురి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ధర్మపురికి చెందిన సంగనభట్ల దినేశ్‌ను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు పోటీపడినా.. మాజీమంత్రి, దివంగత జువ్వాడి రత్నాకర్‌రావుకు నమ్మినబంటుగా పనిచేసిన దినేశ్‌కే పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య మొన్నటి వరకు వార్ జరి గిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేయకముందు జీవన్‌రెడ్డి కొందరి పేర్లను ప్రతిపాదించారు. అయినా అభివృద్ధి కోసమంటూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కూడా మరికొందరి పేర్లను ప్రతిపాదించారు. వారి ద్దరి మధ్య గొడవలు జరగడంతో నామినేషన్ పదవుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో గ్రంథాలయ చైర్మన్ పదవిని దినేశ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు చెందిన నియోజకవర్గం కావడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దక్కించుకున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి నుంచి చాలామంది పదవి కోసం పోటీపడినప్పటికీ చివరకు దినేశ్‌ను పదవి వరించింది.


