రమణయ్య మరణం తీరని లోటు | - | Sakshi
Sakshi News home page

రమణయ్య మరణం తీరని లోటు

Mar 29 2026 7:21 AM | Updated on Mar 29 2026 7:21 AM

● చరిత్ర రాష్ట్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి

జగిత్యాల: ప్రముఖ చరిత్రకారుడు రమణయ్య మరణం చరిత్రకు, ప్రజలకు తీరని లోటు అని చరిత్ర రాష్ట్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి అన్నారు. చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు శనివారం నివాళులర్పించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, కోటలు అనే గ్రంథాలు నేటి చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఆయన డైరీ రూపంలో చరిత్రను రాసి ఒక నూతన ఒరవడి చుట్టారని తెలిపారు. సమితి సభ్యులు సుదర్శన్‌, నరేశ్‌, నిర్మల, రజిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement