జగిత్యాల: ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య మృతి తీరని లోటని ప్రముఖ సాహితీవేత్త, రచయిత కేవీ.నరేందర్ అన్నారు. రమణయ్య మృతికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ అస్థిత్వాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో రచించడంతో పాటు, వాటిని పలు భాషల్లో ముద్రించారని, గ్రామీణ చరిత్రను ఎంతో వెలికితీశారని అన్నారు. ఆయన మృతి యావత్ తెలంగాణకు తీరని లోటన్నారు.
ఆలయాల అభివృద్ధికి ఎంపీ కృషి
రాయికల్(జగిత్యాల): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో సీతారాముల క ల్యాణ వేదికకు ఎంపీ నిధులు మంజూరు చే యగా నిర్మించిన కల్యాణ వేదికను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు ఆకుల మహేశ్, పట్టణ అధ్యక్షుడు కు ర్మ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు కోల శంకర్, నాయకులు బోయిని నరేందర్, ఎనుగంటి రాజు, ఆర్మూర్ నరేందర్, కనికారపు రాజేశ్, గంగారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.


