వెల్గటూర్: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ సత్యప్రసాధ్ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పనులను బుధవారం పరిశీలించారు. ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎండపల్లి మండలం పాతగూడూరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి, పాఠశాల పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు పరిశీలించి, పనులు నాణ్యతగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెల్గటూర్ మండలం సంకెనపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. వెల్గటూర్‌లోని పీహెచ్‌సీని పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. డీఈవో రాము, డీఎంహెచ్‌వో సుజాత, డీపీవో మదన్‌మోహన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, పీఆర్ ఈఈ లక్ష్మణ్‌రావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాధ్


