కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి) వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైస్ చాన్స్‌లర్ కిషన్ రె డ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తామన్నారు. విద్యార్థులకు పతకాలు, ప్రశంసపత్రాలు అందించారు. ఫైనలియర్ విద్యార్థులు తమ అనుభవాలు, కళాశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు 24 గంటలు ప్రయోగశాలలు తెరచి ఉంచాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. అతిథులకు ప్రిన్సిపల్ నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


