మల్లాపూర్: శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలు
పెగడపల్లి: ముస్తాబైన నంచర్ల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం
మల్లాపూర్/పెగడపల్లి: మల్లాపూర్ మండలం వాల్గొండ వద్ద గోదావరి నది తీరంలో కొలువుదీరిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. 25న ఉదయం 5గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. 26న ఉదయం 8గంటలకు స్వామివారికి తెప్పోత్సవం, కుంకుమార్చన, 27న ఉదయం 11.52 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం జరిపించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు అన్నప్రసాద వితర చేస్తారు. పెగడపల్లి మండలంలోని నామాపూర్, నంచర్ల, ఎల్లాపూర్, అయితిపల్లి, ల్యాగలమర్రిలోని శ్రీరామచంద్రస్వామి ఆలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.


