జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం బీర్‌పూర్ మండలకేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రూ.1.43 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. ఎంపీడీవో భీమేష్, తహసీల్దార్, సుజాత, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజగోపాల్‌రావు పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం కోనాపూర్, వడ్డెరకాలనీ, రేచపల్లి, సారంగాపూర్‌లో మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో సలీం, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిషేధం అభినందనీయం
లక్ష్మీపూర్ మహిళా సంఘాలు తీసుకున్న ప్లాస్టిక్ నిషేధం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే రెండు మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ నల్ల కవిత, ఎంపీడీవో రమాదేవి, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, డీఈ మిలింద్, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, తహసీల్దార్ వరందన్, ఆర్‌ఐ భూమయ్య, ఎంపీవో రవి బాబు, ఏపీఎం రాజయ్య, మండల సమైక్య అధ్యక్షురాలు మారు సత్తవ్వ పాల్గొన్నారు.


