మల్యాల: హనుమాన్ చిన్న జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కొండగట్టు ఆలయంలో ఏప్రిల్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఎస్పీ అశోక్‌కుమార్, ఆలయ ఈవో అంజారెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ వహించాలన్నారు. తాగునీరు, వసతులు కల్పించాలని సూచించారు. వైద్య శిబిరాల ఏర్పాటు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీపీవో మదన్ మోహన్, తహసీల్దార్ వసంత, ఎంపీడీఓ స్వాతి, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.


