కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నల్లగుంటపల్లికి చెందిన రైతు వేల్పుల ఐలయ్య(65) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఐలయ్య తాను సాగు చేసిన కూరగాయాలను కరీంనగర్ మార్కెట్‌కు తరలించాడు. తిరిగి టీవీఎస్ ఎక్సెల్‌పై నల్లగుంటపల్లికి వెళ్తున్నాడు. దుర్శేడ్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


