జగిత్యాలటౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనం రూ.18వేలకు పెంచాలని, బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటి చంద్రశేఖర్ కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని కోరారు. ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని కోరారు. టీచర్లు, ఆయాలకు వేసవి సెలవులు మంజూరు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన, కార్యదర్శి స్వప్న, జయప్రద, సురేఖ, శోభ తదితరులు పాల్గొన్నారు.


