మహిళా సంఘాలకు చేయూత | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు చేయూత

Mar 24 2026 8:03 AM | Updated on Mar 24 2026 8:03 AM

జగిత్యాలరూరల్‌: మహిళాసంఘాలకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని, వడ్డీలేని రుణాలిస్తూ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేట, మోతె, రూరల్‌ మండలం తిమ్మాపూర్‌, పోరండ్ల, సోమనపల్లి, తాటిపల్లిలో మహిళా సంఘాల భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబర్‌పేట అటవీ ప్రాంతంలో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం ఉపాధి హామీ పేరు మార్చి కఠిన నిబంధనలు పెట్టడంతో కూలీలకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. ఏటీసీ కేంద్రంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో వాసవి, సర్పంచులు గంగాధర్‌, మహేష్‌, నక్క హరీశ్‌, చెవుల గంగన్న, ఏఈలు రాజమల్లయ్య, విజయ్‌, ఆర్‌ఐలు నరేందర్‌, భూమయ్య, నాయకులు దామోదర్‌రావు, ఎల్లారెడ్డి, నక్కల రవీందర్‌రెడ్డి, బాల ముకుందం, రౌతు గంగాధర్‌, సందీప్‌రావు, ములసపు మహేష్‌ పాల్గొన్నారు.

వడ్డీలేని రుణాలిస్తూ మహిళలకు అండగా ప్రభుత్వం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement