జగిత్యాలక్రైం: సారంగాపూర్ డిప్యూటీ రేంజ్ అధికారి రవికుమార్ ఉత్తమ అటవీశాఖ అధికారిగా ఎంపికయ్యారు. సోమవారం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ మహ్మద్ నదీం చేతుల మీదుగా రవికుమార్ అవార్డు అందుకున్నారు. అటవీ సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు ఈ అవార్డు అందించారు.
జగిత్యాల సెక్షన్
అధికారి పూర్ణిమకు..
జగిత్యాల అటవీశాఖ సెక్షన్ అధికారి కె.పూర్ణిమ ఉత్తమ అటవీశాఖ అధికారిగా ఎంపికయ్యారు.


