జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని డీపీవో మదన్‌మోహన్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస రైతువేదికలో ఇటీవల ఎన్నికై న వార్డు సభ్యులకు మొదటి విడతగా 15 గ్రామాలకు చెందిన 130 మందికి సోమవారం శిక్షణ ప్రారంభించారు. శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన వసతులు గుర్తించాలని, అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం 16 అంశాలపై వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో విమల, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో కందుకూరి రవిబాబు పాల్గొన్నారు.


