నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్‌లో క్లీనికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బేటి బచావో బేటి పడావోపై విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. గర్భవతిగా నమోదైనప్పటి నుంచే ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కౌన్సెలింగ్ చేయాలన్నారు. డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న మూడు నూతన స్కానింగ్ సెంటర్ల అనుమతుల అంశాన్ని కలెక్టర్‌కు నివేదించామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు అతిక్రమించిన మూడు స్కానింగ్ సెంటర్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేశామన్నారు. మాతాశిశు సంరక్షణాధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ కోసం అమలవుతున్న నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతినెలా ఫాం ఎఫ్‌లో వివరాలు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధికారి సుధీర్, భూమేశ్వర్, శంకర్ పాల్గొన్నారు.


