బీజేపీ బలోపేతంతో కాంగ్రెస్‌కు భయం
రాయికల్: క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతంతో భయపడుతున్న కాంగ్రెస్ నాయకులు సర్పంచ్‌లను బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతోందని, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు అధిష్టానం ఎదుట తమ పరువు కాపాడుకునేందుకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. వక్రబుద్ధిని మానుకోవాలని సూచించారు. కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గెలుపొందిన బీజేపీ అభ్యర్థులను అభినందించారు. రాష్ట్ర నాయకులు మోరపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, ప్రధాన కార్యదర్శులు భూమేశ్, సంజీవ్, శ్రీనివాస్, అల్లె నర్సయ్య, కుర్మ నారాయణరెడ్డి, ఏనుగు ముత్యంరెడ్డి, మంగళారపు లక్ష్మీనారాయణ, మచ్చ నారాయణ, సతీశ్, రవి పాల్గొన్నారు.


